TASK Members Lounge

       This section was written by Mr./Ms. Name Lastname for TASK. TASK appreciate their sincere efforts towards the TASK Development.                        -TASK Team

Music Album by Mr. Devi Prasad

News Article by Dr. Koppula Sushruta in ఆంధ్రజ్యోతి

ఆంధ్రిక,సుశ్రుత 1972 డిసెంబరు 11న మాకు అమ్మాయి పుట్టింది. నేను వృక్షశాస్త్రాభిమానిని కనుక మొక్కలకు సంబంధించిన పేరు పెడదామనుకున్నా. నాకప్పుడు 1859లో వాల్టర్ ఎలియట్ రాసిన పుస్తకం 'ఫ్లోరా ఆంధ్రిక' (Flora andrica: ఆంధ్రాకు చెందిన మొక్కలు అని లాటిన్ భాషలో అర్థం) మనసులో మెదిలింది. ఆ పేరుకే ఫిక్సయిపోయాను. కాని పెద్దలందరూ మా అమ్మ 'అచ్చయమ్మ' పేరు పెట్టమన్నారు. కనీసం 'అ'తో మొదలయ్యే పేరైనా పర్వాలేదన్నారు. దానితో 'ఫ్లోరా'ను పక్కన పెట్టి అందరికీ ఆమోదమైన 'ఆంధ్రిక ' పేరును ఖరారు చేశాను. ఐతే, అప్పుడు 'జై ఆంధ్ర' ఉద్యమం ఉద్ధృతంగా నడుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మా అమ్మాయికి 'ఆంధ్రిక ' అని నామకరణం చేశాననుకున్నారు చాలామంది. 1974, నవంబర్ 2న అబ్బాయి పుట్టాడు. అప్పటికి నాలుగేళ్ల నుంచి భారత ప్రభుత్వం వారి ఆయుర్వేద కౌన్సిల్‌లో వనౌషధీ సర్వేక్షణాధికారిగా విజయవాడలో ఉండడం వల్ల నాకు ఆతీ సత్యనారాయణ, గూడూరు నమశ్శివాయ, ప్రకాశచంద్ర శతపధి - ఇత్యాధి ఉద్ధండులైన ఆయుర్వేద పండితులతో అనుబంధం ఏర్పడింది. మేమంతా ఆయుర్వేదానికి సంస్కృతమెంత అవసరమో, వనమూలికా విజ్ఞానం కూడ అంతే అవసరమని గుర్తించాం. ఆ విధంగా వారికి వృక్షశాస్త్రం మీదా, నాకు ఆయుర్వేదం మీదా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఈ సందర్భంగానే నేను ఆయుర్వేద గ్రంథాలయిన చరక సంహిత, సుశ్రుత సంహితలను చదివాను. ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసిన సుశ్రుతుడి గౌరవార్థం మా అబ్బాయికి 'సుశ్రుత' పేరు పెట్టాను. కొసమెరుపు ఏంటంటే సుశ్రుతకు అబ్బాయి పుట్టినప్పుడు వాడికి 'సంహిత' అని పేరు పెట్టాడు. అంటే, నా మనవడు 'సుశ్రుత సంహిత' (సుశ్రుతుడి రచన) అన్నమాట. నిజమే కదా! - ««  Read More  »»

TASK Member Mr. Murali Krishna Vemuri featured in 'SBNTECH Co., Ltd. - IP videophones' presentation

 ******** THANK YOU ********
www.000webhost.com